: ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్
జమ్మూకాశ్మీర్ పూంఛ్ సెక్టార్ లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల నుంచి సరిహద్దుల్లోని రెండు భారతీయ సైనిక శిబిరాలపై కాల్పులు జరుపుతున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదు. చొరబాటుదార్లకు మద్దతుగా పాక్ ఈ దారుణానికి తెగబడినట్టు తెలుస్తోంది. కాల్పులతో భారత సైన్యం దృష్టి మరల్చి, చొరబాటుదార్లను దేశంలోకి పంపించేందుకు శత్రుదేశం పన్నాగం పన్నుతోందని, అందులో భాగంగా ఈ కాల్పులని సైనికాధికారులు చెబుతున్నారు.