: స్పాట్ ఫిక్సింగ్ పై బీసీసీఐకి చేరిన నివేదిక


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాముపై దర్యాప్తు సాగించిన కమిటీ తన నివేదికను బీసీసీఐకి సమర్పించినట్లు తెలిసింది. అయితే, వివరాలు వెల్లడి కానప్పటికీ.. విచారణ చేసిన తీరుపై బోర్డు సభ్యులు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రాలను ప్రశ్నించినదీ, లేనిదీ దర్యాప్తులో పేర్కొనలేదని బీసీసీఐ వర్గాలంటున్నాయి. ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత బీసీసీఐ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ పదవికి సంజయ్ జగ్దాలే రాజీనామా చేయడంతో ఇద్దరు సభ్యుల కమిటీయే దర్యాప్తును పూర్తి చేసింది.

  • Loading...

More Telugu News