: దేవినేని ఉమ అరెస్టు
కృష్ణా జిల్లా మూలపాడులో ధర్నా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంట్లో 250 ఓట్లు ఉన్నాయని టీడీపీ ఏజెంటు ఆరోపించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. దాంతో, టీడీపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈనేపథ్యంలో టీడీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. వారికి సంఘీభావం పలుకుతూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.