: రాజీనామా చేస్తామని సోనియాకు తేల్చిచెప్పాం: మంత్రి గంటా
సమైక్యాంధ్రకు మద్ధతుగా హస్తినలో సమావేశాలు పెట్టి మరీ లాబీయింగ్ చేస్తున్న సీమాంధ్ర మంత్రులు రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కేంద్రమంత్రి కావూరి నివాసంలో సమావేశమైన మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన బాణి వినిపించారు. రాష్ట్రాన్ని విభజించే పరిస్థితే వస్తే తాము పదవుల్లో కొనసాగలేమని సోనియాకు వెల్లడించామన్నారు. వెంటనే 15 మంది మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా చెప్పారు. పార్టీలో ఉండే సమైక్య రాగం వినిపిస్తామన్నారు.