: మేడమ్ అపాయింమెంట్ కోసం చిరు, కావూరి యత్నాలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణపై హైకమాండ్ త్వరలో నిర్ణయం వెల్లడిస్తుందన్న వార్తల నేపథ్యంలో సోనియాతో చర్చించేందుకు సీమాంధ్ర నేతలు యత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ ఇప్పటికే అధిష్ఠానానికి లేఖ రాసిన వీరు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ మేరకు మేడమ్ సోనియా అపాయింట్ మెంట్ కావాలని ఈ ముగ్గురు కేంద్ర మంత్రులకు బాధ్యతను అప్పగించారు.