: మహిళా ప్రొఫెసర్ పై కన్నేసిన విద్యార్థి
ఇటీవల కాలంలో పలువురు టీచర్లు విద్యార్థుల పాలిట కీచకులుగా మారిన సంఘటనలు చూస్తున్నాం. కానీ, గుజరాత్ లో సీన్ రివర్సయింది. వడోదరలోని ఎంఎస్ యూనివర్శిటీలో ఓ పీజీ విద్యార్థి.. మహిళా ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులకు ఉపక్రమించాడు. జాహిద్ పఠాన్ అనే ఈ యువకుడు.. అదే వర్శిటీలో బోధకురాలిగా పనిచేస్తున్న యువతి పట్ల పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతగాడి వేధింపులు భరించలేక ఆ యువతి వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన వర్శిటీ బోర్డు జాహిద్ ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా యోచిస్తోంది.