: కర్నూలు జిల్లా నేతలకు 'హౌస్ అరెస్ట్'
ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిపోయే కర్నూలు జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని పలువురు నేతలకు గృహనిర్బంధం విధించారు. బనగానపల్లె నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాటసాని రాంరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత జనార్ధనరెడ్డిలను గృహనిర్బంధంలో ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. అంతేగాకుండా, ఓటర్లను తరలిస్తున్న చల్లా రామకృష్ణారెడ్డికి చెందిన 6 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కోయలకుంట్లలో కాటసాని, చల్లా వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.