: మంత్రి తోటపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ


రాష్ట్ర మంత్రి తోట నర్సింహంపై వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వీరవరం పంచాయతీకి జరుగుతున్న పోలింగు కేంద్రంలో వీరంగం సృష్టించారని అందుకే ఆ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. వీరవరం పంచాయతీ సర్పంచ్ పదవికి మంత్రి భార్య పోటీ చేస్తుండటంతో పోలింగు బూతు వద్ద హల్ చల్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.కాగా, తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం తోట నర్సింహం మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News