: భారీగా స్పందిస్తున్న ఓటర్లు
రాష్ట్రంలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగుకు ఓటర్లు భారీగా స్పందిస్తున్నారు. ఉదయం పదిగంటలకే 31.1 శాతం పోలింగు నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 40.2 శాతం నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 21 శాతం నమోదైంది. ఇక మిగతా జిల్లాల్లోనూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మరోవైపు, కొన్ని జిల్లాల్లో చిన్న ఘర్షణలు మినహా పోలింగు ప్రశాంతంగా కొనసాగుతోంది.
గుంటూరు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఇదే జిల్లాలో తాడికొండ మండలం కంతేరులో పోలింగు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇటు, రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ భద్రత చేపట్టడంతో పోలింగు సజావుగా జరుగుతోంది. వరంగల్ జిల్లా కురివి మండలం జీరోలులోని మూడవ వార్డులో ఎన్నికల గుర్తులు తారుమారయ్యాయి. దాంతో, అధికారులు ఎన్నికను నిలిపివేశారు.