: ఆ లేడీ దొరికిపోయింది
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా, రానియాలో ఈ నెల 21న డాక్టర్ ను హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హోటల్లో డాక్టర్ సతీష్ చంద్ర(42) గొంతు, మర్మాంగాలను కోసివేసిన స్థితిలో మరణించి ఉన్నారని కాన్పూర్ ఎస్ఎస్పీ యశస్వి యాదవ్ మీడియాకు తెలిపారు. గత 13 ఏళ్లుగా ఆ డాక్టర్ మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ తనపై అత్యాచారం చేస్తున్నట్లుగా నిందితురాలు తెలిపిందని వెల్లడించారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పారు. ఈ నెల 21 వీరు హోటల్లో కలుసుకున్నారని, ఆల్కహాల్ సేవించిన తర్వాత నిందితురాలు డాక్టర్ ను చంపి మర్మాంగాన్ని వేరు చేసి అతడి భార్యకు కొరియర్ చేసిందని తెలిపారు. కానీ, కొరియర్ ప్యాకెట్ కు రక్తం మరకలు అంటి ఉండడంతో కొరియర్ సంస్థ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది.