: ఎన్డీయేదే హవా: ఐబీఎన్ సర్వే
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు ధీమాగా చెబుతున్నా, ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు పెడితే ఎన్డీయేదే ఆధిపత్యమని సీఎన్ఎన్ ఐబీఎన్-సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. 545 స్థానాల లోక్ సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ నంబర్ 272. కానీ, యూపీఏ 149 నుంచి 157 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందట. యూపీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ 100 స్థానాలను సంపాందించడానికే కష్టాలు పడాల్సి వస్తుందని సర్వే పేర్కొంది. ఎన్డీయే స్థానాలు అంతా కలిపినా 172 నుంచి 180తో ఆగిపోతాయట. బీఎస్పీకి 15-19, వామపక్షాలకు 22-28 స్థానాలు, ఎస్పీకి 17-21 వస్తాయని తేలింది. అంటే యూపీఏ, ఎన్డీయే రెండూ మెజారిటీకి చాలా దూరంలోనే ఉండిపోతాయని తేలింది. మళ్లీ ప్రాంతీయ పార్టీలదే హవా అని ఈ సర్వేలో స్పష్టమైంది.