: రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం


రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమయింది. మొత్తం 6971 పంచాయతీలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తరువాత సర్పంచి అభ్యర్ధి ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తం 1910 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News