: ఈ బెలూన్‌........., బుడగే అనుకుంటే దొరికిపోతారు!!


చూడడానికి ఇది బుడగ లాగానే ఉంటుంది. కానీ అది అమెరికా వారి ఆయువుపట్టు వంటి నగరాల్లో ఒకటైన వాషింగ్టన్‌ సిటీకి రక్షణ కవచం వంటిదని అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే మరి. ఎందుకంటే.. విమానం బొమ్మలాగా ఉండే బెలూన్‌ రూపంలో ఓ శక్తిమంతమైన రాడార్‌ వ్యవస్థను ఇమిడ్చారట అక్కడి రక్షణ అధికారులు.

జాయింట్‌ ల్యాండ్‌ ఎటాక్‌ క్రూయిజ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ ఎలివేటెడ్‌ నెటెడ్‌ సెన్సార్‌ అనేది ఈ బెలూన్‌ యొక్క పూర్తి పేరు. దీన్ని వారు జెలెన్స్‌ అని పిలుస్తున్నారు. ఇందులో జంట రాడార్‌లు ఉంటాయిట. 340 మైళ్ల దూరం వరకు చూడగలిగేలా సునిశితమైన రాడార్‌ టెక్నాలజీని ఈ బెలూన్‌లో అమర్చారు. ఒకసారి ఈ బెలూన్‌లోకి హీలియం నింపి.. భూమినుంచి పదివేల అడుగుల ఎత్తులో వదిలితే, అక్కడే ఉంటూ 30 రోజుల పాటూ నిరంతరాయంగా నిఘా సేవలను అందిస్తుందట.

  • Loading...

More Telugu News