: బొత్స స్వంత నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్తత
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్వంత నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్పంచి అభ్యర్ధులుగా బరిలో ఉన్న ఒక వర్గం వారు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అనుమానం రావడంతో, మరో వర్గం వారు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా, ఇక్కడి పంచాయతీ గెలుపు పీసీసీ చీఫ్ కు ప్రతిష్ఠాత్మకం కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి రేగుతోంది. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.