: కాంగ్రెస్ ఓటమే మా లక్ష్యం: ప్రకాశ్ కారత్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు సీపీఐ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్. చేవచచ్చిన పాలనతో పతనం దిశగా సాగుతున్న కాంగ్రెస్ సర్కారు ఓటమి కోసం తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ను వ్యతిరేకించే క్రమంలో బీజేపీకి దగ్గరకాబోమన్నారు. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీకి గానీ, మరెవరికి గానీ మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఓటమి ఖరారైన కాంగ్రెస్ తో పొత్తుకు అవకాశమేలేదని తేల్చి చెప్పారు.