: నకిలీ పాస్ పోర్టుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ
నకిలీ పాస్ పోర్టుతో ఓ మహిళ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పాస్ పోర్టు వ్యవహారమై ఆమెను విచారిస్తున్నారు. గతంలో తప్పుడు పాస్ పోర్టులు జారీ చేశారని పాస్ పోర్టు అధికారులపై ఆరోపణలు ఉండేవి. అందుకు ఉదాహరణగా నటి మోనికా బేడీకి తప్పుడు పాస్ పోర్టు మన రాష్ట్రంలోనే తయారయిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనతో మరోసారి నకిలీ పాస్ పోర్టు వ్యవహారం వార్తల్లోకెక్కింది.