: అమ్మను ఆనందంలో ముంచెత్తుదామని....
తల్లి పుట్టిన రోజు సందర్భంగా బహుమతితో ఆనందంలో ముంచెత్తుదామనుకుని కలలుగన్న ఓ యువతి పుట్టెడు దుఃఖంలో ముంచెత్తింది. చెన్నైలో ఆదర్శ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విశాలి తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా మంచి బహుమతి కొందామని స్నేహితురాలు ప్రవీణతో కలిసి ద్విచక్రవాహనంపై షాపింగ్ కు వెళ్లింది. రెండు చూడీదార్ లు కొని తిరిగి వస్తుండగా బ్రిక్లైన్ రోడ్ వద్ద మున్సిపాలిటీ వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విశాలి అక్కడికక్కడే మృతి చెందింది. కీల్ పాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.