: అమర్త్యసేన్ కు శివసేన ఉచిత సలహా


ఇటీవలే మోడీపై వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కిన నోబెల్ గ్రహీత, ప్రఖ్యాత ఆర్ధికవేత్త అమర్త్యసేన్ కు శివసేన ఉచిత సలహా ఇచ్చింది. రాజకీయాల్లో వేలుపెట్టొద్దంటూ మందలింపు ధోరణిలో సూచించింది. అయితే, అమర్త్యసేన్ తన భారతరత్న అవార్డును తిరిగిచ్చేయాలంటూ బీజేపీ ఎంపీ చందన్ మిత్రా చేసిన వ్యాఖ్యలన శివసేన తప్పుబట్టింది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సంపాదకీయంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.

'అమర్త్యసేన్ కు ఆర్ధికవేత్తగా అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రతిష్ఠలున్నాయి. అయితే, అతని ప్రత్యర్థులైనా సరే, అవార్డులు వాపసు ఇచ్చేయమనడం సరికాదు. ఆయన దేశంలో పేదవాళ్ళ కోసం కొన్ని అద్భుతమైన సిద్ధాంతాలు చేసి ఉండొచ్చు. కానీ, దేశంలోని తాజా స్థితిగతులకు మోడీ కారణం కాదు కదా? నోబెల్ గెలుచుకున్న అమర్త్యసేన్ అయినా, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపలేడు' అని థాకరే పేర్కొన్నారు. 'రాజకీయాలు మీకెందుకు, మీ పని మీరు చూస్కోండి' అని ప్రజలు నిలదీస్తే, అమర్త్యసేన్ ఏం బదులివ్వగలరు? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News