: డోపింగ్ నిబంధనలను ఎద్దేవా చేశాడు.. మూల్యం చెల్లించాడు!
డోపింగ్ నిబంధనల్ని ఎద్దేవా చేసినందుకు ఓ టెన్నిస్ క్రీడాకారుడికి భారీ శిక్ష వేశారు అధికారులు. డోపింగ్ నిబంధనలు సరిగా లేవంటూ హేళన చేసినందుకు సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు విక్టర్ ట్రాయికిపై 18 నెలల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదిన్నరపాటు ట్రాయికి టెన్నిస్ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హుడయ్యాడు.