: రాణించిన ధావన్, కార్తీక్.. భారత్ 294/8
రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ జింబాబ్వేపై విరుచుకుపడ్డారు. దీంతో, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన టీమిండియా బ్యాటింగ్ ధావన్, కార్తీక్ సమయోచిత ఇన్నింగ్స్ తో కుదుటపడింది. నిలకడగా ఆడిన వీరు క్రీజులో కుదురుకుని సొగసైన షాట్లతో అలరించారు. ఈ క్రమంలో ధావన్(116) వన్డేల్లో తన సెంచరీల సంఖ్య పెంచుకోగా, కార్తిక్(69) తన అర్ధసెంచరీల రికార్డు మెరుగుపరుచుకున్నాడు. వీరి తరువాత అత్యుత్తమ స్కోరు ఎక్సట్రాలవే.
చివరి ఓవర్లో తొలి బంతికే జడేజా అవుటవ్వడంతో వినయ్ వరుస బంతులను 6, 4, 6 గా మలచగా.. ఇన్నింగ్స్ చివరి బంతిని సమీ సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 23 పరుగులను పిండుకున్నారు. దీంతో భారత్ జింబాబ్వేకు 295 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా స్లో ఓవర్ రేట్ కారణంగా జింబాబ్వే జట్టుకు భారీ జరిమానా బారిన పడే అవకాశముంది.