: నిరాశపరిచిన రాయుడు
జింబాబ్వేతో తొలివన్డేలో ఆకట్టుకున్న అంబటి రాయుడు రెండో వన్డేలో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులే చేసి విటోరి బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 13.2 ఓవర్లలో 2 వికెట్లకు 55 పరుగులు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ (14) ఓ వివాదాస్పద క్యాచ్ కు వెనుదిరగ్గా.. రైనా (4) సైతం స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. దీంతో, జట్టును ఆదుకునే భారం ఓపెనర్ ధావన్ (55 బ్యాటింగ్), వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (30 బ్యాటింగ్) పై పడింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 70 పరుగులు జోడించడంతో.. భారత్ 30 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.