: చైనా-భారత్ మధ్య సరిహద్దు ఒప్పందం: ఆంటోనీ
భారత్, చైనాల మధ్య సరిహద్దు విషయమై ఘర్షణలు నివారించేందుకు రక్షణశాఖ చర్యలు తీసుకుంటోందని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. న్యూఢిల్లీలో కార్గిల్ 14 వ విజయదివస్ పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, త్వరలో రెండు దేశాల రక్షణ మంత్రులు బీజింగ్ లో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతం దౌలత్ బాగ్ ఓల్డీలో గత 21 రోజులుగా జరుగుతున్న ఘటనలు బాధాకరమన్నారు. త్వరలోనే వీటికి చరమగీతం పాడుతామన్నారు.