: గుజరాత్ రెస్టారెంట్లలో వంటకాలకు వింత పేర్లు !


విభిన్న రుచులు కోరుకునే వారికి త్వరలో గుజరాత్ రెస్టారెంట్లలో వింత వంటకాలు దర్శనమివ్వబోతున్నాయి. వాటికి వింత పేర్లు పెట్టాలని రెస్టారెంట్ యజమానులు ఆలోచిస్తున్నారు. యూపీఏ అవినీతిని వ్యతిరేకిస్తూ 'గుజరాత్ రాజ్య హోటల్ ఫెడరేషన్' (జీఆర్ హఎచ్ ఎఫ్) సభ్యులు ఈ వినూత్న తరహా నిరసనకు సిద్ధమవుతున్నారు. హోటల్ కు వచ్చే కస్టమర్లకు వేడివేడిగా '2జీ కా సమోసా', 'కోల్ గేట్ శాండ్ విచ్' పేరుతో వడ్డించబోతున్నట్లు తెలిపారు. దీనిపై ఫెడరేషన్ ఇతర సభ్యులతోనూ మాట్లాడామని.. ఆహారం, పానీయాలకు యూపీఏ హయాంలో జరిగిన స్కాంల పేర్లను పెడుతున్నట్లు చెప్పారు. ప్రతి పౌరుడికి తన అభిప్రాయాలను తెలుపుకునే హక్కు ఉందని ఫెడరేషన్ సభ్యుడు అశ్విన్ గాంధీ అన్నారు.

ఈ నిరసనకు దక్షిణాది గుజరాత్ హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సనత్ రెలియా మద్దతు తెలిపారు. 'బోఫోర్స్', '2జీ', ఇంకా పలు స్కాంల పేర్లు మెనూలో చేర్చడానికి అనుమతించామన్నారు. సేవాపన్నును తీసి వేయించడానికి కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఒప్పుకోనందువల్లే ఈ నిరసన చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏసీ రెస్టారెంట్లపై సేవా పన్నుపై నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికే ముంబయిలోని 'అదితి రెస్టారెంటు' తమ కస్టమర్లకు ఇచ్చే బిల్లులో యూపీఏ స్కాంలను ప్రస్తావించింది. దాంతో, కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా ఆ రెస్టారెంటును మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం కూడా జరిగింది.

  • Loading...

More Telugu News