: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా


టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేవలం 17.3 ఓవర్లలో 66 పరుగులకే కీలకమైన నాలుగు టాపార్డర్ వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఎదురీదుతోంది. రోహిత్ శర్మ(1), రైనా(4), రాయుడు(5) సింగిల్ డిజిట్ స్కోరు చేయగా కోహ్లీ 14 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో, దినేశ్ కార్తిక్ 4, ధావన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎక్స్ ట్రాల రూపంలో 21 పరుగులు రావడం విశేషం. 22 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే బౌలర్లలో విటోరీ(2), జార్విస్(1), ఛాతారా(1) రాణించారు.

  • Loading...

More Telugu News