: రాష్ట్రం విచ్ఛిన్నం కాకుండా అడ్డుకుంటాం: శైలజానాథ్
రాష్ట్ర విభజన కాకుండా అడ్డుకుంటామని మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు తమ ప్రాంత ప్రజలెవరూ సుముఖంగా లేరని అన్నారు. ప్రజల కోరిక మేరకు తామంతా ప్రజస్వామ్యబద్ధంగా ప్రయత్నాలు ప్రారంభించామని, ఎలాగైనా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని తెలిపారు. టీడీపీ లేఖ ఇచ్చామని చెప్పుకుంటోందని, ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డ టీడీపీ రాష్ట్ర విభజనను ఎలా ఒప్పుకుంటుందని మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. బీజేపీకి రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యమే లేకుండా, వారెలా విభజిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా సమైక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు.