: సాయంత్రం వైఎస్సార్సీపీ నేతల భేటీ
వైఎస్సార్సీపీ అగ్రనేతలు ఈ సాయంత్రం భేటీ కానున్నారు. వైఎస్సార్సీపీ కి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు సీమాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. పార్టీ ఇప్పటికే తెలంగాణకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు స్పీకర్ కు సమర్పించాల్సిన అవసరం వచ్చింది? అనే అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా ఎమ్మెల్యేలను గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వివరణ అడుగనున్నారు. ప్రజల్లోకి ఇప్పటికే వ్యతిరేక సంకేతాలు వెళ్లాయని, వాటిని నివారించడానికి వారిపై చర్యలు తీసుకునే అవకాశముందని పలువురు నేతలు చెబుతున్నారు. కొండా సురేఖ తన భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పిన నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీకే చెందిన పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.