: 'భాగ్ మిల్కా భాగ్' పై గోవా కటాక్షం


'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా గోవా కూడా చేరింది. ఈ స్ఫూర్తిదాయక చిత్రానికి మూడు నెలల పాటు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు అక్కడి సర్కారు ప్రకటించింది. ఇంతకుముందు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటన చేశాయి. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం అమెరికాలోనూ మంచి వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పర్హాన్ అక్తర్.. మిల్కా సింగ్ పాత్ర పోషించాడు.

  • Loading...

More Telugu News