: టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియా బ్యాటింగ్


జింబాబ్వే పర్యటనలో రెండోవన్డే నేడు హరారేలో జరుగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా.. జింబాబ్వేకు లక్ష్యాన్ని నిర్ధేశించనుంది. మంచి జోరుమీదున్న టీమిండియా బ్యాట్స్ మెన్ కు ఇది చక్కటి అవకాశం. తమ ప్రతిభ ప్రదర్శించేందుకు, సత్తా నిరూపించి టీమిండియాలో తమ స్ధానం సుస్థిరం చేసుకునేందుకు దీన్ని మరో అవకాశంగా బెర్తు కన్ఫర్మయిన ఆటగాళ్లు భావిస్తున్నారు. కోహ్లీ మాత్రం తమ బ్యాట్స్ మెన్ జింబాబ్వేను ఆటాడుకుంటారని చెబుతున్నప్పటికీ, జింబాబ్వే బౌలర్లు రాణించి టీమిండియాను కట్టడి చేయాలనే వ్యూహంతో ఉన్నారు. గత వన్డేలో జింబాబ్వే ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్ లో అసాధారణ ప్రతిభ చూపించారు. నాలుగు వికెట్లను గిరాటేసి తమను తేలిగ్గా తీసేయొద్దంటూ హెచ్చరికలు పంపారు. ఫేవరేట్ గా భారత్ దిగుతున్నప్పటికీ బౌలింగ్ ప్రదర్శన కోహ్లీని కాసింత కలవరపెడుతోంది.

  • Loading...

More Telugu News