: ఢిల్లీలో 'టీ' తుపాను


తెలంగాణ అంశంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో కసరత్తులు సాగుతున్నాయి. ఈ ఉదయం కాంగ్రెస్ వార్ రూంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో విజయంతో పాటు పలు అంశాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. అనంతరం, తెలంగాణ విభజనపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో సీమాంధ్ర మంత్రుల అభిప్రాయాలను కూడా విన్నవించారు. మరి కాసేపట్లో వారంతా వార్ రూంలో అధిష్ఠానం పెద్దలతో భేటీ కానున్నారు. దిగ్విజయ్ తో భేటీకి ముందు సీమాంధ్ర నేతలంతా ముఖ్యమంత్రిని కలిసి తమ వాదన బలంగా వినిపించాలని కోరారు.

కాగా, సీమాంధ్ర నేతలు ఆధిష్ఠానం పెద్దలతో భేటీలో మాట్లాడే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఏపీ భవన్లోని గురజాడ హాలులో సమావేశమైన సీమాంధ్ర మంత్రులు, ఈసారి తమ వాదన విన్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తే రాష్ట్ర విభజన ఖాయమని, ఆ అవకాశం కలగనీయకుండా, విభజనే పరిష్కారం అంటే అందుకు తాము పదవులు, సభ్యత్వాలు వదులుకునేందుకు కూడా వెనుకాడమనే సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయనున్నారు. వీరి వ్యవహారంతో రాష్ట్రంలో మరోసారి 'టీ' తుపాను రగులుతోంది.

తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విభజన తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని, విభజన చెయ్యాల్సిందేనని అల్టిమేటం ఇచ్చేందుకు అన్నిపార్టీల నేతలతో కలిసి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోసారి విద్యార్ధులను, ఉద్యోగులను ఉద్యమబాట పట్టించేందుకు పలు సంఘాలు భేటీలపై భేటీలు నిర్వహిస్తున్నాయి. పార్టీల్లో రగులుతున్న విద్వేషాలు మరోసారి రాజధాని ప్రజలకు తీవ్ర ఇక్కట్లు మిగిల్చేలా ఉన్నాయి.

  • Loading...

More Telugu News