: శాంతి భద్రతలకు అన్ని చర్యలు తీసుకుంటాం: డీజీపీ
హైదరాబాద్ వరుస పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ దినేష్ రెడ్డి చెప్పారు. తీవ్రవాదులు అత్యాధునిక పేలుడు పదార్ధాన్ని వినియోగించారని ఆయన వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఉగ్రవాద వ్యతిరేక దళాలు బయల్దేరినట్టు డీజీపీ చెప్పారు. వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.