: విజయమ్మకు కొండా సురేఖ అల్టిమేటం
సమైక్యాంధ్రకు మద్దతుగా 16 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పట్ల ఆ పార్టీ నేత కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలపై పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమాధానం చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. జవాబు చెప్పకపోతే రెండ్రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఏదేమైనా, శాసనసభ్యుల రాజీనామాలను వ్యతిరేకిస్తున్నామంటూ, తమ రాజీనామాలపై ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని సురేఖ కోరారు. ఇక, వైఎస్సార్సీపీ అధినాయకత్వంతో తమకు విభేదాలున్నాయని ఆమె అంగీకరించారు.