: ప్రధాని అభ్యర్ధిపై బీజేపీలో ఏకాభిప్రాయం ఉంది : రాజ్ నాథ్ సింగ్


ప్రధానమంత్రి అభ్యర్ధిత్వంపై భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను, కథనాలను ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ప్రధాని అభ్యర్ధిపై బీజేపీలో ఏకాభిప్రాయం ఉందన్నారు. దీనిపై ఎందుకింత ప్రచారం జరుగుతుందో తనకు అర్ధం కావడంలేదన్నారు. ఈ విషయంలో పార్టీ ఒకే మాటపై నిలబడుతుందని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాజ్ నాథ్ వాషింగ్టన్ నుంచి ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో పైవిధంగా మాట్లాడారు. అయితే, ఈ వ్యాఖ్యలతో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధి అన్న ప్రచారానికి ఓ విధంగా తెరదించినట్లైందని అనుకోవచ్చు!

  • Loading...

More Telugu News