: ఢిల్లీలో సీఎంతో సీమాంధ్ర మంత్రుల భేటీ
కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందట ఏపీ భవన్ లో సమావేశమైన మంత్రులు రాష్ట్ర విభజన అంశంపై సీఎంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వీరంతా తమ నిర్ణయాన్ని తెలపనున్నారు. అటు సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టారు.