: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా


రాష్ట్ర విభజన జరగబోతోందంటూ సమాచారం అందుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. సర్వేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి ఈ ఉదయం శాసన సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామాలను ఫ్యాక్స్ ద్వారా సభాపతికి పంపుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

  • Loading...

More Telugu News