: షుగరువ్యాధికో కొత్తరకం చికిత్స
షుగరు వ్యాధిని నివారించేందుకు, ఈ వ్యాధిని నయం చేయడానికి కొత్త రకం చికిత్సలను కనుగొనేదిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దంతాలకు సంబంధించిన మూల కణాలతో షుగరు వ్యాధికి చికిత్సను అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముంబైలోని స్టిమేడ్ ప్రైవేట్ డెంటల్ స్టెమ్‌సెల్స్ బ్యాంకుకు చెందిన నిపుణులు దంతాలనుండి సేకరించిన మూలకణాలతో పలురకాల వ్యాధులను నయం చేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా కణజాల, అవయవసంబంధిత వ్యాధులైన షుగరు, కీళ్లనొప్పులకు ఇలా దంతాలనుండి సేకరించిన మూలకణాలతో చికిత్సను అందించవచ్చని వీరు చెబుతున్నారు. మూడేళ్లుగా వీరు దంత మూలకణాలను సేకరించి భద్రపరుస్తున్నారు. ఈ మూలకణాలను మైనస్ 150 డిగ్రీల వద్ద క్రయోజనిక్ ట్యాంకుల్లో భద్రపరుస్తామని, వ్యాధుల చికిత్సకు అవసరమైనప్పుడు సదరు వ్యక్తులు తమ దంతాల మూలకణాలను తిరిగి తీసుకుని వ్యాధులనుండి విముక్తి పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు.