: తెలంగాణ ఇస్తే నక్సలిజం ఎందుకు పెరుగుతుంది?: డీజీపీ


రాష్ట్ర విభజన అంశం మరింత వేడెక్కిన ప్రస్తుత తరుణంలో డీజీపీ దినేశ్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలిజం గణనీయంగా తగ్గిపోయిందని డీజీపీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో, రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం పెరిగిపోతుందని సీఎం నివేదిక ఇచ్చినట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో.. డీజీపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర శాంతిభద్రతలపై నివేదిక అందించేందుకు డీజీపీ హస్తిన వెళ్ళిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News