: తెలంగాణ వచ్చేస్తోంది.. అందరూ సహకరించండి: జానారెడ్డి
తెలంగాణ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోందని మంత్రి జానారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కొన్నేళ్లుగా కృషి చేస్తోందన్నారు. ఏళ్ళనాటి సమస్య ఇప్పటికి తుది అంకానికి చేరుకుంటే, కీలక దశలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న నాయకులు, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారానికి పలు సూచనల్ని ఉప ముఖ్యమంత్రి ద్వారా కేంద్రానికి పంపిస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమని కూడా ఆయన అన్నారు. రాజీనామాలతో వైఎస్సార్సీపీ నేతల నైజం బయట పడిందని జానారెడ్డి స్పష్టం చేశారు.