: మద్యం మత్తులో కెనడా నుంచి అమెరికా ఈదాడు!


అతడో కెనెడియన్. పేరు మొరిల్లో (47). ఉండేది విండ్సర్ నగరంలో. అలవాటుగా, ఓ రోజు బాగా తాగాడు. కిక్కు తలకెక్కింది, ఏం చేయాలో పాలుపోలేదు. కానీ, ఏదో ఒకటి చేయాలని రక్తంలో కలిసిపోయిన ఆల్కహాల్ పురిపెడుతోంది. ఏమీ ఆలోచించకుండా డెట్రాయిట్ నదిలోకి దూకేశాడు. ఎడాపెడా ఈదుకుంటూ అమెరికా దిశగా సాగిపోయాడు. మరో ఆలోచన లేకుండా ఈతపైనే మనసు లగ్నం చేశాడు. అమెరికా తీరం చేరగానే, మద్యం కిక్కు కాస్త తగ్గినట్టనిపించింది. ఈసారి మనసు కెనడావైపు లాగింది. మళ్ళీ నదిలో దూకేశాడు.

ఇంకొంచెం సేపు ఈదితే తన విండ్సర్ నగరానికి చేరుకునే వాడే. కానీ, అంతర్జాతీయ తీర రక్షక దళం సభ్యులు విలన్లలా అతగాడిని చుట్టుముట్టారు. 'ఈదింది చాల్లే' రమ్మంటూ ఒడ్డుకు తీసుకువచ్చారు. కెనడా చట్టాలను అనుసరించి తాగుబోతు మొరిల్లోకు పాతికవేల డాలర్ల ఫైనేశారు. దీనికంతటికీ కారణం మొరిల్లో గాళ్ ఫ్రెండేనట. తన స్నేహితుడు కనిపించడం లేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరో వ్యక్తి చాలా సీరియస్ గా డెట్రాయిట్ నదిలో ఈదుకుంటూ వెళుతున్నాడన్న సమాచారంతో, ఎట్టకేలకు మొరిల్లోను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News