: మోడీ వ్యతిరేక లేఖపై సంతకం చేస్తే చర్యలే: కరుణానిధి
నరేంద్ర మోడీకి అమెరికా వీసాను తిరస్కరించాలని భారత ఎంపీలు ఒబామాకు రాసిన లేఖపై డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎంపీలెవరైనా ఆ లేఖపై సంతకం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆ లేఖపై ఉన్న సంతకాలు తమవి కాదని పలువురు ఎంపీలు స్పష్టం చేస్తుండడంతో, ఆ లేఖపై పలు సందేహాలు నెలకొన్నాయి.