: వీరశివారెడ్డి రాజీనామా వెనుక సీఎం: హరీశ్ రావు
కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తముందని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజీనామా చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణపై తేల్చకుండా కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఆయన మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను రాజీనామా చేస్తున్నట్టు వీరశివారెడ్ది ఈరోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.