: అధిష్ఠానంపై నమ్మకముంది: మంత్రి శ్రీధర్ బాబు
తమ అధిష్ఠానంపై అపారమైన నమ్మకముందని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తారనే తాము ఆశిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారని, తాము మాత్రం అధిష్ఠానం చెప్పే శుభవార్త కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమని, అందుకు అవసరమైన కార్యాచరణ ఢిల్లీలో సిద్ధమవుతోందని ఆయన తెలిపారు.