: 200 ఎకరాల్లో బిజినెస్ స్కూలు


దేశంలోనే అతిపెద్దదైన బిజినెస్ స్కూలును మెదక్ జిల్లా సదాశివపేట్ లో సిద్ధం చేస్తున్నట్టు వోక్సెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూల్ ప్రారంభ కార్యక్రమాలను గురువారం హైదరాబాద్ లో నిర్వహించారు. 200 ఎకరాల విస్తీర్ణంలో 3 వేల మంది విద్యార్ధులకు అవకాశం కల్పించే విధంగా తీర్చిదిద్దిన ఈ బిజినెస్ స్కూల్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుండగా, పలువురు ఎన్ఆర్ఐలు ఈ స్కూల్ నిర్వహణలో భాగస్వాములని వ్యవస్థాపకుడు ప్రవీణ్ పుల తెలిపారు. అత్యాధునిక విద్యను ఈ స్కూల్ లో అందిస్తామని డీన్ ఆర్.నరసింహన్ తెలిపారు.

  • Loading...

More Telugu News