: జేన్ ఆస్టిన్ కు బ్రిటన్ అరుదైన పురస్కారం


ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి జేన్ ఆస్టిన్ కు అరుదైన గౌరవం లభించనుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కొత్త పది పౌండ్ల నోటు మీద జేన్ ఆస్టిన్ చిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది. ప్రైడ్ అండ్ ప్రిజుడీస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, ఎమ్మా వంటి అద్భుతమైన నవలలు రచించిన జేన్ ఆస్టిన్ ముఖ చిత్రంతో ఈ నోటు అందుబాటులోకి రానుంది. కాగా ఈ కొత్త పది పౌండ్ల నోటు 2017 నుంచి అందుబాటులోకి రానుంది. ఆస్టిన్ సోదరి గీసిన చిత్రాన్నే బ్యాంకు తన నోట్లపై ఉపయోగించనుంది. ప్రైడ్ అండ్ ప్రిజుడీస్ లోని 'చదవడాన్ని మించిన ఆనందం మరొకటి లేదు'అని అర్థం వచ్చే వాక్యం కూడా ఆమె చిత్రం క్రింద పొందుపరచనుంది.

  • Loading...

More Telugu News