: అరచేతిలో పాస్ పోర్ట్ దరఖాస్తు
పాస్ పోర్టు దరఖాస్తు ఇకనుంచి మరింత సులభతరం కానుంది. వచ్చే రెండు, మూడు నెలల్లో స్మార్ట్ పోన్ల నుంచే పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం 'ఎం-పాస్ పోర్ట్ సేవా' అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని రూపొందించినట్లు కేంద్ర ప్రధాన పాస్ పోర్ట్ అధికారి ముక్తేశ్ పరదేశి తెలిపారు.
హైదరాబాదు ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో పాస్ పోర్ట్ కేంద్రాలను లింక్ చేసే సీసీటీవీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-సేవ కేంద్రాల్లో పాస్ పోర్టు సేవలను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ లో ఏర్పాటైన కొత్త సీసీటీవీ పాస్ పోర్ట్ కేంద్రం దేశంలోనే మొదటిదని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి కె.శ్రీకర్ రెడ్డి తెలిపారు.