: ఆదాయ పన్ను శాఖ ఉపాధ్యక్షుడిపై సీబీఐ కేసు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉపాధ్యక్షుడు వీరభద్రప్పపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్ విత్ 13(1) సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. మూడు కోట్ల 92 లక్షలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఏక కాలంలో బెంగళూరు, ముంబయిలోని వీరభద్రప్ప కార్యాలయాలు, నివాసాలపై దాడులు చేశారు. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.