: అనంతపురం ఎమ్మెల్యే రాజీనామా
రాష్ట్ర విభజన అంశం వేడెక్కుతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న శాసనసభ్యుల జాబితా పెరిగిపోతోంది. ఈ ఉదయం వీరశివారెడ్డి, మధ్యాహ్నం బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాలు చేయగా.. సాయంత్రానికి మరో ఎమ్మెల్యే వారి సరసన చేరారు. అనంతపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ ఆటలాడుతోందని ఆరోపించారు. తన వైఖరేంటో చెప్పకుండా, కాంగ్రెస్ అమోయమం సృష్టిస్తోందని విమర్శించారు.