: కాంగ్రెస్ దాడులను టీడీపీ ఖండించకపోవడం సిగ్గుచేటు: రోజా
పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడులకు పాల్పడతున్నారని పార్టీ నేత రోజా ఆరోపించారు. చిత్తూరులో నేడు మాట్లాడుతూ, కాంగ్రెస్ దాడులను తెలుగుదేశం పార్టీ ఖండించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సహకార సంస్థల ఎన్నికల తరహాలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. సీఎం కిరణ్ కు ఎన్నికల భయం పట్టుకుందని, పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమకు పట్టం కట్టడాన్ని ఆయన ఓర్వలేకపోతున్నారని రోజా చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా తమదే అంతిమ విజయమని స్పష్టం చేశారు.