: సమైక్యాంధ్ర కోసం బాలినేని రాజీనామా
సమైక్య రాష్ట్రం కోసం వివిధ పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టారు. తాజాగా, ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఫాక్స్ చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే సమైక్య రాష్ట్రం కోరుతూ కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.