: స్కూళ్ల సమీపంలో జంక్ ఫుడ్ అమ్మకూడదిక!
స్కూళ్ల సమీపంలో జంక్ ఫుడ్, గ్యాస్ తో కూడిన డ్రింక్స్ అమ్మకాలను నియంత్రించాలంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను 10 రోజుల్లోగా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, దీనిపై భారతీయ ఆహార ప్రమాణాల సంస్థ, ఇతరుల అభిప్రాయాలను తెలుసుకుని రెండు వారాల్లోగా కోర్టుకు తెలియజేయాలని కోరుతూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. పాఠశాలల సమీపంలో జంక్ ఫుడ్, గ్యాస్ తో కూడిన డ్రింక్స్ ను నిషేధించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ఉదయ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.