: గేమ్ రూపంలో వచ్చిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'


'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమా ప్రచారం వినూత్నంగా ప్రారంభమైంది. సినిమా ఆధారంగా రూపొందించిన వీడియోగేమ్ ను నటుడు షారూక్ ఖాన్ నేడు ముంబయిలో విడుదల చేశారు. దీని ద్వారా చిన్నారులను ఆకట్టుకోవాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చిత్ర విజయంలో చిన్నారులు ముఖ్యపాత్ర పోషించనున్నారని షారూక్ తోపాటు దర్శకుడు రోహిత్ శెట్టి బలంగా నమ్ముతున్నారు. ఈ వీడియో గేమ్ ను డిస్నీ యూటీవీ డిజిటల్ విభాగం రూపొందించింది. ఈ గేమ్ కు "చెన్నై ఎక్స్ ప్రెస్: ఎస్కేప్ ఫ్రమ్ రామేశ్వరం' అనే పేరు దీనికి పెట్టారు.

  • Loading...

More Telugu News